శ్రీ లలితా వైభవం -11వ రోజు ప్రవచనం 🙏
🌺 లలితా పరాభట్టారిక — ఆనంద స్వరూపిణి నందిని అంటే ఏమిటి? 👉 నందం = ఆనందం 👉 నందయతి ఇతి నందినీ అంటే 👉 సమస్త ప్రాణికోటికి ఆనందాన్ని ప్రసాదించేది కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన రహస్యం ఉంది: జ్ఞానికి → అదే ఆనందం అజ్ఞానికి → అదే విషాదం అందుకే గీత చెప్పింది: 👉 విషాదయోగం అజ్ఞానంతో మొదలవుతుంది 👉 సాంఖ్యయోగం జ్ఞానంతో ముగుస్తుంది మనం చేసే పొరపాటు ఏంటంటే — 👉 ధర్మాలను పట్టుకుంటాం 👉 ధర్మిని వదిలేస్తాం ధర్మి = సబ్స్టెన్స్ (గుణాతీతం) ధర్మం = గుణాలు 👉 గుణాల ద్వారా గుణాతీతాన్ని తెలుసుకుని 👉 ఆ గుణాలను గుణాతీతంలో లయం చేయడమే 👉 పరిపూర్ణ ఆనందం అది లలితాంబ ప్రసాదించే ఆనందం. 🔥 విజ్ఞానాశిని – విఘ్నాల మూలనాశనం విఘ్నం అంటే ఏమిటి? ఒకటి కాదు అమ్మా… 👉 మూడే మూడూ విఘ్నాలు: నామం రూపం క్రియ ఈ మూడు కలిసే 👉 సంసారం విశేష దృష్టి ఉన్నంతవరకు 👉 దెబ్బ తప్పదు అందుకే విఘ్నం అంటే 👉 విశేషంగా దెబ్బతీసేది లలితాంబ ఏమి చేస్తుంది? 👉 విశేష దృష్టిని కరిగిస్తుంది 👉 సామాన్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అదే మోక్షానికి ద్వారం. 🌸 త్రినయనా — తిరోధానం & అనుగ్రహం అమ్మవారు త్రినయనా. అంటే — త్రిగుణాల వైపు తీసుకెళ్తుంది → బంధం త్రిగుణాతీత...