******“ఆభాసం నుంచి సత్యం వరకు”# బ్రహ్మ సూత్రాలు
🔱 మొదటి భాగం అసంతతి — ఆత్మ ఎందుకు అన్ని శరీరాల్లో బాధపడదు? ఓం నమో గురుభ్యః 🙏 బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి చెప్పిన ఒక కీలకమైన సూత్రం: > “అసంతతేశ్చ వ్యతికరః” ఈ ఒక్క మాట అర్థమైతే 👉 జీవుడు 👉 బాధ 👉 కర్మ 👉 ఈశ్వరుడు అన్నీ క్లియర్ అవుతాయి. కానీ మొదట 👉 అసంతతి అనే పదమే మమ్మల్ని మోసం చేస్తుంది. 🔹 “అసంతతి” అంటే నిజంగా ఏమిటి? సాధారణంగా మనం అనుకుంటాం: > సంతతి = సంతానం అసంతతి = సంతానం లేకపోవడం కానీ ఇక్కడ అర్థం అది కాదు. వేదాంతంలో: 👉 సంతతి అంటే వ్యాప్తి 👉 వ్యాపించి ఉండటం అందుకే: > సంతానం అంటే — వంశం వ్యాపించడం సంతతి అంటే — విస్తరించడం అందువల్ల — 👉 అసంతతి అంటే వ్యాప్తి లేకపోవడం 👉 వ్యాపించకపోవడం అంటే — > ఆత్మ లేనిది కాదు ఆత్మ వ్యాపించలేదని కాదు కానీ — 👉 ఒక శరీరాన్ని నమ్ముకున్న తరువాత ఆ మేరకే ఆగిపోవడం ఇదే అసంతతి. 🔥 అసలు ఆక్షేపణ (పెద్ద ప్రశ్న) ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వేస్తారు: > “ఒకే ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది అంటారు కదా? అయితే ఒక శరీరానికి వచ్చిన సుఖదుఃఖాలు అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మకు రావాలేనా?” ఇది చిన్న ప్రశ్న కాదు. ఇది అద్వైతంపై వేసే పెద్ద ఆక్షేపణ. ఎందుకంటే గీతలోనే ఉంది: ...